మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ఇరుముడి. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా సంచలన హిట్ అయ్యింది. ఇక సినిమా రెండు వీకెండ్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని మూడో వారాంతం లోకి ఎంటర్ అయ్యింది.
ఇంట్రెస్టింగ్ గా ఈ మూడో వారాంతంలో కూడా భారీ బుకింగ్స్ తో దుమ్ము లేపింది. బుక్ మై షోలో ఈ సినిమా 15వ రోజు 1 లక్ష టికెట్స్ కి పైగా సేల్ చేసుకోవడం విశేషం. దీనితో ఇన్ని రోజులు అయినా ఇరుముడి మేనియా గట్టిగా కొనసాగడం విశేషం. ఇక ఇది కేవలం శుక్రవారం బ్యాటింగ్ మాత్రమే అసలు వీకెండ్ రోజులు శనివారం, ఆదివారం అంతకు మించే పెర్ఫార్మన్స్ ఉంటుంది. సో ఈ రెండు రోజుల్లో ఇరుముడి ఎలా రాణిస్తుందో చూడాల్సిందే.
