గత కొన్ని నెలల నుంచి టాలీవుడ్ సినిమా ఎలాంటి వాతావరణంలో ఉందో అందరికీ తెలిసిందే. సరైన సినిమాలు లేక ఒకవేళ కొన్ని వచ్చినా అవీ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవడంతో దాదాపు కొన్ని నెలల పాటు థియేటర్స్ లో సరైన ఆక్యుపెన్సీలు లేక ట్రెండ్ పేలవంగా నడిచింది. ఇక మధ్యలో కొన్ని వారాలు అయితే అసలు సినిమాలు ఉన్నాయో లేదో అన్న విధంగా పరిస్థితి నెలకొంది.
ఇలా చాలా శుక్రవారాలు డ్రై గానే గడిచి ఎట్టకేలకి జూన్ నెల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కి కొత్త ఊపు రానుంది అని చెప్పవచ్చు. సాధారణంగా ట్రేడ్ వర్గాల్లో జూన్ నెలకి కూడా ఇంతకుముందు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఫిబ్రవరి, జూన్ నెలలలో సినిమాలు రావడం మంచి వసూళ్లు సాధించిన లెక్కలు ఒకింత తక్కువే కానీ ఈ ఏడాది మాత్రం అలా కాదు. జూన్ నెలలో ప్రతీ వారం కూడా సాలిడ్ సినిమాలు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి.
జూన్ 4 – ‘పెద్ది’
మెగాపవర్ రామ్ చరణ్ తోనే జూన్ నెలలో బాక్సాఫీస్ మోత మోగనుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కలయికలో వస్తున్న ఈ భారీ సినిమాతో మళ్ళీ బోసిపోయిన థియేటర్స్ అన్నీ కళకళలాడుతాయని ట్రేడ్ సర్కిల్స్ బలంగా నమ్ముతున్నారు.
జూన్ 11 – ‘సింగ్ గీతం’
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు తెరకెక్కించిన మరో వినూత్న సబ్జెక్టు ఇది. కల్కి 2898 ఎడి లాంటి సినిమాని తీసిన భారీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారి సమర్పణలో వస్తున్న ఈ సినిమా పట్ల కూడా ఆడియెన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది.
జూన్ 19న సామ్ సినిమాతో పాటు వడ్డే నవీన్ రీ ఎంట్రీ
జూన్ 19కి మాత్రం మూడు నాలుగు సినిమాలు ఉంటే వాటిలో స్టార్ నటి సమంత నటించిన సాలిడ్ యాక్షన్, ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ మళ్ళీ ఆమె స్టార్డంని చూపించడానికి సిద్ధంగా ఉంటే దీనితో పాటుగా టాలీవుడ్ ఆనాటి ప్రముఖ నటుడు వడ్డే నవీన్ రీఎంట్రీ ఇచ్చేందుకు తన ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ తో రాబోతున్నారు.
ఇక చివరి వారం అఖిల్ అక్కినేని ‘లెనిన్’ కి సొంతం
మొదటి వారం పెద్ది సినిమాతో మొదలైతే జూన్ ఆఖరి ఫ్రైడే మాత్రం అక్కినేని యంగ్ హీరో అవైటెడ్ సినిమా ‘లెనిన్’ సొంతం చేసుకుంది. ఈ సినిమాపై కూడా మంచి బజ్ నెలకొనగా మేకర్స్ కూడా సినిమా రిజల్ట్ పై మంచి నమ్మకాన్ని పెట్టుకున్నారు.
దీనితో పాటుగా లెనిన్ నిర్మాణ సంస్థ సితార వారు తీస్తున్న ‘ఎపిక్’ కూడా జూన్ లోనే వచ్చే అవకాశం ఉన్నట్టుగా టాక్ ఉంది.
సో ఇలా చాలా కాలం తర్వాత ఒక నెలలో ఇన్ని ముఖ్య సినిమాలు వస్తుండడం అనే ఒక ప్యాకెడ్ రిలీజ్ అని చెప్పొచ్చు. మరి ఇవన్నీ అంచనాలు అందుకొని థియేటర్స్ లో మంచి ఆదరణ అందుకోవాలని ఆశిద్దాం.


