Dhurandhar: షారుఖ్ తర్వాత ఈ ఫీట్ ఒక్క అక్షయేకే అట!

Dhurandhar

గత ఏడాది బాక్సాఫీస్ బ్లాస్ట్ గా నిలిచిన పలు చిత్రాల్లో దాదాపు హిందీ సినిమాలే ఎక్కువ కనిపిస్తాయి. మంచి అంచనాలు నడుమ వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కేవలం హిందీ భాషలోనే విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. అయితే హిందీలో సీనియర్ స్టార్ హీరోస్ మాత్రమే కాకుండా యంగ్ హీరోలు కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నారు.

అయితే ఇండియన్ సినిమా దగ్గర ఒకే ఏడాదిలో 2000 వేల కోట్ల వసూళ్లు సాధించిన నటుడుగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి రేర్ రికార్డు ఉంది. జవాన్, అలాగే పఠాన్ సినిమాలతో 2000 కోట్లకి పైగా వసూళ్లు ఒకే ఏడాదిలో విడుదలైన సినిమాలతో అందుకున్న నటుడుగా నిలిచారు. అయితే ఇదే ఫీట్ ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడికి సొంతం అయినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఆ నటుడు ఎవరో కాదట. తన సాలిడ్ పెర్ఫామెన్స్ లతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న అక్షయే ఖన్నా అట. తాను నటించిన సినిమాలు గత ఏడాది దుమ్ము లేపాయి. ఛావా ఇంకా ధురంధర్ (Dhurandhar) సినిమాల్లో హీరోలతో సమానంగా పవర్ఫుల్ విలన్ గా నటించిన తాను ఈ రెండు సినిమాల వసూళ్లతో 2000 కోట్ల క్లబ్ లో ఒకే ఏడాది నుంచి విడుదలైన సినిమాలతో నిలిచినట్టు తెలుస్తుంది. ఛావా ఈజీగా 800 కోట్లకి పైగా రాబట్టగా ధురంధర్ (Dhurandhar) కేవలం హిందీ లోనే 1200 కోట్లు రాబట్టింది. ఇలా షారుఖ్ ఖాన్ తర్వాత ఆ రేంజ్ రేర్ రికార్డుని ఈ టాలెంటెడ్ నటుడు ఖాతాలో వేసుకున్నాడట.

Exit mobile version