అప్పుడు శ్రుతి హాసన్.. ఇప్పుడు శ్రీలీల.. పవర్ ఇచ్చేది పవన మాత్రమే..!

Sree Leela

టాలీవుడ్‌లో ఒకప్పుడు సెన్సేషన్‌గా మారిన శ్రీలీల ప్రస్తుతం వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ‘ధమాకా’తో భారీ క్రేజ్ తెచ్చుకున్న ఆమెకు ఆ తర్వాత వచ్చిన ‘మాస్ జాతర’, ‘ఆది కేశవ’, ‘రాబిన్ హుడ్’ సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కోలీవుడ్‌లో చేసిన ‘పరాశక్తి’ కూడా పెద్దగా కలిసి రాలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలీల ఆశలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’పైనే ఉన్నాయి. ఒకప్పుడు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ శ్రుతి హాసన్, ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు దాదాపు అదే తరహా పరిస్థితిలో ఉన్న శ్రీలీల కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందేమోనని ఆశిస్తోంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ సినిమా అయినప్పటికీ, పవన్ కళ్యాణ్‌కు సూటయ్యేలా హరీష్ శంకర్ కథను బలంగా మార్చినట్లు సమాచారం. కమర్షియల్ అంశాలు, పవర్‌ఫుల్ థీమ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని అంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే శ్రీలీల కెరీర్ మళ్లీ గాడిలో పడే అవకాశం ఉంది.

Exit mobile version