ఆ ఇద్దరు లెజెండ్స్ తర్వాత విజయ్‌కే సొంతం..!

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమా రిలీజ్ అవుతున్న అరుదైన రికార్డును దళపతి విజయ్ సొంతం చేసుకోబోతున్నాడు. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ ఈ తరహాలో సీఎంగా ఉండగా తమ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ కూడా వారి సరసన నిలిచాడు. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఆయన చివరి చిత్రం ‘జన నాయగన్’ జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం అభిమానులకు పెద్ద మైనస్‌గా మారింది.

ఈ సినిమా స్పెషల్ షోలను పిల్లలకు వేయాలని విజయ్ రాజకీయ పార్టీ ప్లాన్ చేయగా, సెన్సార్ రూల్స్ వల్ల అది సాధ్యం కాకుండా పోయింది. తెలుగు హిట్ ‘భగవంత్ కేసరి’ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో మమిత బైజు ఎపిసోడ్ మినహా సెకండాఫ్, విలన్ ట్రాక్, ఫ్లాష్‌బ్యాక్‌లను పూర్తిగా మార్చేశారు.

ముఖ్యంగా క్లైమాక్స్ రజనీకాంత్ ‘రోబో’ రేంజ్‌లో ఉండబోతుందని టాక్. టాక్‌తో సంబంధం లేకుండా తమిళనాడు, ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version