కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “టాక్సిక్”. , దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా పట్ల ఇది వరకు మంచి హైప్ ఉంది. అయితే ఈ సినిమాతోనే బాలీవుడ్ సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం ధురంధర్ పార్ట్ 2 కూడా ఉండడంతో చాలా మంది ఈ రెండు సినిమాలకి గట్టి పోటీ ఉంటుంది అని భావించారు.
పైగా టాక్సిక్ గ్లింప్స్ కూడా హైప్ ని సెట్ చేసింది. కానీ ఫైనల్ గా టాక్సిక్ టీజర్ వచ్చాక మాత్రం ఆడియెన్స్ లో రెస్పాన్స్ మారిపోయింది. టాక్సిక్ టీజర్ చూసాక ఈ సినిమా తోనా ధురంధర్ 2 తో క్లాష్ కి రావడానికి ట్రై చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు.
ఈ రెస్పాన్స్ చూస్తుంటే మార్చ్ 19న ధురంధర్ 2 కి పాన్ ఇండియా లెవెల్లో రూట్ క్లియర్ చేసినట్టే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి వీటిని మించి టాక్సిక్ లో మేటర్ ఉంటే తప్ప ధురంధర్ 2 తో క్లాష్ లో ఈ సినిమా నిలిచే అవకాశాలు తక్కువే.. ఆల్రెడీ ధురంధర్ కంటెంట్ అండ్ టేకింగ్ విషయంలో ఒక క్లారిటీ అందరిలో ఉంది. సో దీనిని మించే ఛాలెంజ్ ని టాక్సిక్ ఎదుర్కోవాల్సి ఉంది.
