నవ్వించిన శ్రీవిష్ణు.. ఇక థ్రిల్ చేస్తాడా?

Mrithyunjay

టాలీవుడ్ లో ప్రెజెంట్ ఉన్న యువ హీరోస్ లో ఎవరికి వారు సెపరేట్ మార్క్ ని సెట్ చేసుకొని రాణిస్తున్న వారిలో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా సెట్ అయ్యిన హీరో శ్రీవిష్ణు కూడా ఒకరు. అయితే శ్రీవిష్ణుకి అంటూ ఒక సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. ముఖ్యంగా తన ముందు సినిమాల నుంచి ఫాలో అవుతున్నవారికి అయితే తాను ఎలాంటి సత్తా ఉన్న నటుడు తన సినిమాల సెలక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది.

ఇలా తన నుంచి చాలా కాలం నుంచి మిస్ అవుతున్న మంచి థ్రిల్లర్ సబ్జెక్టులు లాంటిది ఫైనల్ గా ఇప్పుడు రాబోతుంది. గత శుక్రవారం విష్ణు విన్యాసం అంటూ కామెడీ సినిమాతో ఎంటర్టైన్ చేసిన విష్ణు ఈ ఒక్క వారం గ్యాప్ లోనే ఈ కొత్త శుక్రవారం మృత్యుంజయ్ అనే థ్రిల్లర్ తో రాబోతున్నాడు. మరి గత వారం నవ్వించిన శ్రీవిష్ణు ఈ వారం ఏ మేరకు థ్రిల్ చేస్తాడో చూడాలి మరి. తన ఫాలోవర్స్ కి ఉన్న అంచనాలు రీచ్ అవుతాడో లేదో తెలియాలి అంటే ఈ మార్చ్ 6 వరకు ఆగాల్సిందే.

Exit mobile version