‘మౌళి’ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

#90s సిరీస్‌, ‘లిటిల్ హార్ట్స్’ విజయాలతో మౌళి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలు అందడంతో అతనికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. నూతన దర్శకుడు శ్రీను కంబాలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను రేపు హైదరాబాద్‌లోని ఒక కళాశాలలో చిత్ర బృందం ఆవిష్కరించనుంది. ‘దొంగ నా కొడకా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ క్రైమ్ కామెడీ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.

ఈ చిత్రంలో సుస్మితా షెన్ కథానాయికగా నటిస్తుండగా, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సినిమా విడుదల తేదీతో సహా మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు మరియు టెక్నీషియన్ల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version