మళ్ళీ ‘మంత్ర 2’పై దృష్టి పెట్టిన చార్మీ

charmi

కెరీర్ మొదట్లో చార్మింగ్ బ్యూటీ చార్మీ చేసిన గ్లామరస్ రోల్స్ తనకు ఇంతే పేరు తీసుకొచ్చాయో, అంతకు మించి తను చేసిన ‘మంత్ర’ సినిమా చార్మీకి నటిగా గుర్తింపు తెచ్చింది. దానికి కొనసాగింపుగా మరో హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ‘మంత్ర 2’ సినిమాలో కూడా చార్మీ లీడ్ రోల్ చేస్తోంది. గత సంవత్సరం లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది.

ఆ తర్వాత చార్మీ ప్రతి ఘటన సినిమాతో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమాని కాస్త పక్కన పెట్టారు. ప్రతి ఘటన సినిమా రిలీజ్ కూడా అయిపోవడంతో చార్మీ ఇప్పుడు మళ్ళీ ‘మంత్ర 2’ పై ఫోకస్ పెట్టింగ్. ఈ సినిమా తాజా షెడ్యూల్ నిన్నని నుంచి హైదరాబాద్ లో ప్రారంభమైంది. ‘మంత్ర’ సినిమాని మించి ఉంటుందని అంటున్న ఈ సినిమా ద్వారా కెవి సతీష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. బోనాల శ్రీకాంత్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

Exit mobile version