సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ మాస్ సీక్వెల్ చిత్రమే జైలర్ 2(Jailer 2). దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పట్ల భారీ హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. దీనితో కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కూడా బయటకి వస్తున్నాయి. ఇది వరకే ఈ సినిమాలో కూడా కొందరు బిగ్ స్టార్స్ తాలూకా కామియోలు ఉన్నాయి అని టాక్ వచ్చింది. కొందరివి కన్ఫర్మ్ కూడా అయ్యాయి.
అయితే వీటి అన్నింటిలో ఆ మధ్య బాగా వైరల్ అయ్యిన సంచలన కామియో ఏదన్నా ఉంది అంటే అది హీరో షారుఖ్ ఖాన్ కోసమే అని చెప్పాలి. షారుఖ్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఉన్నట్టు మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. అంతే కాకుండా షారుఖ్ ఏకంగా 10 నుంచి 15 నిమిషాల మేర కనిపిస్తారని కూడా టాక్. సో ఇది కానీ నిజమైతే నార్త్ మార్కెట్ లో జైలర్ 2 కి పెద్ద బూస్టప్ గా నిలుస్తుంది అని చెప్పవచ్చు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
