మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సంగీత దర్శకుల్లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఒకడు. మాస్ అయినా క్లాస్ అయినా ఎలక్ట్రిక్ అయినా ఇంకా డివోషనల్ అయినా కూడా థమన్ ఓ పీక్ డ్యూటీ కొంతమంది హీరోస్ కి సెపరేట్ గా చేస్తాడు. ఇక అలంటి హీరోస్ లో నటసింహం బాలయ్య కోసం కూడా గట్టిగా ఉంటుంది.
బాలయ్య కాంబినేషన్ లో ఇప్పుడు వరకు చేసిన ప్రతీ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇక అఖండ సినిమా నుంచి అయితే వీరి కాంబినేషన్ ఒక బ్లాస్ట్ అని చెప్పాలి. అఖండ 1 కి మెయిన్ పిల్లర్ గా థమన్ తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి సినిమాని తీసుకెళ్లిపోయాడు. అంతేనా అప్పట్లో థియేటర్స్ లో థమన్ స్కోర్ దెబ్బకి స్పీకర్స్ పగిలిపోవడం వైరింగ్ కాలిపోవడం కూడా వంటివి జరిగాయి.
దీనితో మరోసారి పార్ట్ 2 కి కూడా ముందే తాను హెచ్చరించాడు. ఈసారి కూడా కంప్లైంట్స్ వస్తే నేనేం చెయ్యలేను అంటూ చెప్పేసాడు. కానీ మళ్ళీ అదే జరిగింది. పలు థియేటర్స్ లో తమ మ్యూజిక్ దెబ్బకి స్పీకర్లు తగలబడిపోతున్నాయి. దీనితో కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా మొత్తానికి థమన్ మాత్రం మళ్ళీ అప్పటి రోజులు రిపీట్ చేసాడని చెప్పాలి.
