ఇంటర్నెట్లో ‘ఐ’ టీజర్ – లీక్ చేసిన వ్యక్తిపై లీగల్ యాక్షన్.

vikram-ai
విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 180 కోట్ల భారి బడ్జెట్ తో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన సినిమా ‘ఐ’. ప్రతి సినిమాను వేధిస్తున్న సమస్య ‘ఐ’కు ఎదురైంది. ఈ సినిమా టీజర్ ను ఇటివల వాసన్ అనే యువకుడు ఇంటర్నెట్ లో లీక్ చేశాడు. అంతే కాదు సోషల్ మీడియాలో ‘నేను టీజర్ లీక్ చేశాను. మీరు ఎం చేయగలరు’ అంటూ సవాల్ విసిరాడు. అతనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నట్టు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తెలిపారు. ఒకరోజు రాత్రిపూట ఆఫీసులో అక్రమంగా అతను టీజార్ కాపీ చేసుకున్నట్టు మా ఎంక్వయిరీలో తేలింది అని చెప్పారు.

లీక్ చేసిన టీజర్లో విజువల్స్ స్పష్టంగా కనబడకపోవడంతో దర్శకనిర్మాతలు పెద్దగా ఆందోళన చెందలేదు. సెప్టెంబర్ 15న చెన్నైలో తమిళ ఆడియో విడుదల చేస్తున్నారు. ఆ రోజున ఈ టీజర్ ను అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగులో ‘మనోహరుడు’ పేరుతో ఈ సినిమాను అనువదిస్తున్నారు.

Exit mobile version