తెలుగులోనూ రానున్న ఐశ్వర్య రాయ్ కమ్ బ్యాక్ ఫిల్మ్

Aishwarya

1994లో మిస్ వరల్డ్ టైటిల్ కిరీటాన్ని దక్కించుకొని ఎన్నో ఏళ్ళ పాటు ఇండియాలో కొన్ని కోట్లమందికి కలలరాణిగా వెలుగొందిన తార ‘ఐశ్వర్య రాయ్’. హీరోయిన్ గా తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన తర్వాత కూడా జోధా అక్బర్, రావన్, రోబో లాంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి అరాధ్యకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఐశ్వర్యరాయ్ మళ్ళీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వనుంది.

రీ ఎంట్రీలో భాగంగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని ఎందుకుంది. ‘జజ్బా’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఐశ్వర్య రాయ్ తో పాటు ఫేమస్ యాక్టర్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ సినిమా అక్టోబర్ 9న రిలీజ్ కానుంది. తాజాగా ఐశ్వర్య రాయ్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉండడం వలన తెలుగులో కూడా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. తెలుగులో ‘జజ్బా – అడ్వకేట్ అనూరాధ వర్మ’ గా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తెలుగు అండ్ హిందీలో ఒకేరోజు రిలీజ్ అవుతోంది. సంజయ్ గుప్త దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ బాగుండడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

Exit mobile version