పాజిటీవ్ రివ్యూలతో ప్రారంభమైన ‘ఎన్నై అరిందాల్

yennai-arindhaal
అజిత్, త్రిష మరియు అనుష్క నటించి తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఎన్నై అరిందాల్’ సినిమా ఈరోజు విడుదలయ్యింది. గౌతం వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి ఆట నుండీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అజిత్ నటన, త్రిష అందచందాలు అందరినీ మెప్పించాయి. ప్రత్యేక ఫ్యాన్ షో దగ్గర నండీ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. గౌతం నరేషన్ స్టైల్, హరీస్ జయరాజ్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాను తెలుగులో ఎంతవాడు గానీ అనే టైటిల్ తో తెలుగులోకి త్వరలో విడుదలచేయనున్నారు

Exit mobile version