నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “అఖండ 2”. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ భారీ సీక్వెల్ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించి ఇప్పుడు వీక్ డేస్ లో కూడా డీసెంట్ హోల్డ్ లో వెళుతుంది. ఇక ఇలా పాపులర్ సినిమా టికెట్స్ బుకింగ్ యాప్స్ లో అఖండ 2 కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చినట్టు మేకర్స్ చెబుతున్నారు.
బుక్ మై షో ఇంకా డిస్ట్రిక్ట్ యాప్స్ లో అఖండ 2 కి ఈ కొన్ని రోజుల్లోనే 20 లక్షలకి పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో అఖండ 2 తాండవంకి మాస్ రెస్పాన్స్ నే పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా అలాగే ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో 3డి లో కూడా విడుదల అయ్యింది.
The divine mass wave of #Akhanda2 continues to roar ????????
2M+ Tickets sold on @bookmyshow & @district_india ????????
Book your tickets now!
????️ https://t.co/8l5WolzzT6IN CINEMAS NOW #BlockbusterAkhanda2 #Akhanda2Thaandavam pic.twitter.com/kDtbqJYLCE
— 14 Reels Plus (@14ReelsPlus) December 17, 2025
