డబ్బింగ్‌ పూర్తిచేసిన ‘అఖండ 2’.. అదే రోజు రిలీజ్ !

Akhanda-2

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా కనిపించనున్నారు. ఐతే, తాజాగా ఫ్యాన్స్ కి టీమ్‌ శుభవార్త చెప్పింది. ‘అఖండ 2’ డబ్బింగ్‌ పనులు పూర్తయినట్లు టీమ్ తెలిపింది. బాలయ్య బాబు తన పాత్రకు డబ్బింగ్‌ పూర్తిచేసినట్లు తెలుపుతూ ఆయన ఫొటోను టీమ్‌ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోందని టీమ్ తెలిపింది. సీజీ, రీ రికార్డింగ్‌ పనులు ఒకేసారి జరుగుతున్నాయని వెల్లడించింది. తమన్‌ స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా టీజర్‌ ట్రెండ్‌ సృష్టించిన విషయం తెలిసిందే. అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version