Akhanda 2: ఆగని ‘అఖండ 2’ ఆదిపత్యం.. వర్కింగ్ డే కూడా బుకింగ్స్‌లో జోరు..!

Akhanda 2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna) లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’(Akhanda 2) బాక్సాఫీస్ దగ్గర తన జోరు కొనసాగిస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. వీకెండ్ ముగిసినా కూడా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

వర్కింగ్ రోజున కూడా సాలిడ్ బుకింగ్స్..
ఇక ఈ సినిమాకు వర్కింగ్ డే అయిన సోమవారం నాడు కూడా మంచి బుకింగ్స్ జరిగాయి. గత 24 గంటల్లో అఖండ 2(Akhanda 2) సినిమాకు బుక్ మై షోలో 66 వేలకు పైగా టికెట్ బుకింగ్స్ జరగడంతో ఈ సినిమాకు ఎంతటి క్రేజ్ ఏర్పడిందో అందరికీ అర్థమవుతుంది. దీంతో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా ఆది పినిశెట్టి(Aadhi Pinishetty) విలన్ పాత్రలో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version