నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం అఖండ 2 తాండవం కోసం ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా గ్రాండ్ గా ఇవాళ ప్రీమియర్స్ తో థియేటర్స్ లో వస్తుండగా రేపు ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ కి రాబోతుంది. ఇక ఈ సినిమాకి యూఎస్ మార్కెట్ లో కూడా ఇలా బుకింగ్స్ ఓపెన్ చేయగానే సెన్సేషన్ ని సెట్ చేసింది.
ఇక ఈ సినిమా నార్త్ అమెరికాలో క్రేజీ ఓపెనింగ్స్ ని సెట్ చేసుకుంది. ఇలా ప్రీమియర్స్ వసూళ్లు అప్పుడే 2 లక్షల 50 వేల డాలర్స్ కి పైగా అందుకొని స్ట్రాంగ్ ఓపెనింగ్స్ పై కన్నేసింది. ఇలా క్రేజీ వసూళ్లు అఖండ 2 అందుకోబోతుండగా డే 1 కి అంతకు మించిన మార్జిన్ దాటినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో అలాగే 3డి లో కూడా విడుదల చేస్తున్నారు.
