
అక్కినేని ఫ్యామిలీతో పాటు, అక్కినేని అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం.. అఖిల్ మొదటి మూవీ రిలీజ్. వివి వినాయక్ డైరెక్షన్ లో అఖిల్ హీరోగా పరిచయం అవుతూ చేస్తున్న మొదటి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ కానుంది. అఖిల్ తన మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అఖిల్ టైటన్ మరియు మౌంటైన్ డ్యూ లాంటి బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.
తాజాగా అఖిల్ మరో బ్రాండ్ కి అంబాసిడర్ గా సైన్ చేసాడు. అదే నేషనల్ వైడ్ గా ఫేమస్ అవుతున్న కార్బన్ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అఖిల్ సైన్ చేసాడు. అందులో భాగంగా ఇటీవలే అఖిల్ కార్బన్ మొబైల్స్ కోసం తన ఫస్ట్ యాడ్ ని కూడా చేసాడు. త్వరలోనే ఈ యాడ్ ని రిలీజ్ చేయనున్నారు. మొదటి సినిమాలానే అఖిల్ ఎంతో ఆచితూచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అఖిల్ ప్రస్తుతం తన ఫస్ట్ మూవీ ఫైనల్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు. సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.