
ప్రేమికుల రోజు.. ఫిబ్రవరి 14న హైదరాబాద్, శిల్పకళా వేదికలో అక్కినేని అభిమానుల సమక్షంలో భారి ఎత్తున జరిగే కార్యక్రమంలో హీరోగా అఖిల్ ను పరిచయం చేయనున్నారు. గతంలో నాగ చైతన్య హీరోగా పరిచయమైన సమయంలో సైతం ఇదే విధంగా అభిమానులతో పరిచయ కార్యక్రమాన్ని నాగార్జున నిర్వహించారు.
మాస్ కమర్షియల్ వివి వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 16 నుండి ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సయేషా సెగల్ ను ఎంపిక చేశాం. ఆమెకు ఇదే తొలి సినిమా. హీరో హీరోయిన్లు ఇద్దరం చాలా నెర్వస్ గా ఉన్నట్లు హీరో అఖిల్ సోషల్ మీడియాలో తెలిపారు. దర్శకుడు సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇదొక ఫాంటసీ కథ అని టాక్. వెలిగొండ శ్రీనివాస్ కథ అందించగా కోన వెంకట్ ఈ సినిమాకు మాటలు రాస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ పతాకంపై తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలసి యువహీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.