
‘మనం’ లాంటి ఎవర్గ్రీన్ సినిమాని అక్కినేని ఫ్యామిలీకి ఇచ్చిన కృతజ్ఞతతో కింగ్ నాగార్జున తన ముద్దుల తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా లాంచ్ చేసే బాధ్యత నితిన్ ఫాదర్ అయిన సుధాకర్ రెడ్డికి అప్పగించాడు. ఆయన కూడా అఖిల్ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలని ఓ క్రేజీ కాన్సెప్ట్ తో టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ ని దర్శకుడిగా పెట్టి భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించాడు. అన్ని పనులను పూర్తి చేసుకొని, సక్సెఫుల్ గా బిజినెస్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
అఖిల్ సినిమా విషయంలో ట్రేడ్ వర్గాలని రెండు విషయాలు షాక్ కి గురి చేసాయి. మొదటిది.. అఖిల్ మొదటి సినిమాకే సుధాకర్ రెడ్డి ఇంతలా బడ్జెట్ ఎందుకు పెట్టేసాడు అని అనుకున్నారు. ఇక రెండవది ఈ కామెంట్స్ ని పాటా పంచలు చేస్తూ అఖిల్ సినిమా రిలీజ్ కి ముందే 50 కోట్ల పైనే బిజినెస్ చేసింది. ఇంతలా బిజినెస్ జరగడం వలన అఖిల్ కి బంపర్ ఆఫర్ వచ్చిందని సినీ వర్గాల వినికిడి. ‘అఖిల్’ సినిమా ప్రారంభించే సమయంలో అఖిల్ కి ఇంత అని రెమ్యునరేషన్ ఏమీ అనుకోలేదు, కానీ అఖిల్ సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరగడంతో నిర్మాత సుధాకర్ రెడ్డి చాలా హ్యాపీ అయ్యి రిలీజ్ కి ముందు అఖిల్ దాదాపు 7 కోట్లకి పైనే రెమ్యునరేషన్ ముట్ట జెప్పినట్లుగా సినీ వర్గాలు చెప్పిన సమాచారం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీని ప్రకారం అఖిల్ మొదటి సినిమా బిజినెస్ లోనే, కాదు రెమ్యునరేషన్ లో కూడా ఓ సరికొత్త రికార్డ్ ని సృష్టించాడని చెప్పాలి.