మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం ప్రమోషన్స్‌తో సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో పెద్ది పెహల్వాన్ పాత్రలో రామ్ చరణ్ ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో యాక్షన్ తో పాటు బోలెడంత ఎమోషన్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ముఖ్యంగా ఈ సినిమాలో నటిస్తున్న పలు పాత్రలు ఈ చిత్రాన్ని మలుపు తిప్పుతూ కథను ముందుకు తీసుకెళ్తాయట. అందులో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్న అప్పల సూరి పాత్ర కూడా ఒకటి. వెర్సటైల్ విలన్ పాత్రలకు కేరాఫ్ అయిన జగపతి బాబు, ఈసారి ఓ వైభిన్నమైన పాత్రలో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. పెద్ది చిత్రంలో అప్పల సూరి పాత్రలో ఆయన వైవిధ్యమైన లుక్‌తో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి పాత్రలో ఆయన మనకు కనిపిస్తాడట.
కాగా, ఈ చిత్ర ఫస్ట్ హాఫ్‌లో పెద్ది పాత్రను ముందుకు తీసుకెళ్తూ ఇంటర్వెల్ బ్లాక్‌లో రామ్ చరణ్‌కు ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసే ఎమోషనల్ పాత్రగా అప్పల సూరి సాగనుందట. గతంలో ‘రంగస్థలం’ మూవీలో రామ్ చరణ్‌కు విలన్‌గా నటించిన జగపతి బాబు, ఈసారి పెద్దిలో హీరో తండ్రిగా ఒక పాజిటివ్ రోల్‌తో ఎమోషనల్ డ్రామా పండించనున్నాడు. మరి ఆయన పాత్రకు బుచ్చిబాబు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారన్నది ఈ సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.
