
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడవతరం హీరోగా పరిచయం కానున్న అఖిల్ అక్కినేని మొదటి సినిమా ‘అఖిల్’ కోసం అక్కినేని కుటుంబ అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూసారు. కానీ చివరి నిమిషంలో దసరా రోజున ఈ సినిమాని రిలీజ్ చేయడంలేదనే అనౌన్స్ మెంట్ అభిమానులను బాగా నిరుత్సాహపరిచింది. నాగార్జున చిన్న గ్రాఫిక్స్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది, చాలా త్వరలోనే దానిని ఫినిష్ చేసి రిలీజ్ చేస్తాం అని చెప్పడంతో అభిమానులంతా కాస్త ఊపిరి పీల్చుకోవడమే కాకుండా., దీపావళి కానుకగా సినిమా వచ్చేస్తుందని అనుకుంటున్నారు.
కానీ ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అక్కినేని అభిమానుల ఆశలన్నీ ఆశలుగానే మిగిలిపోయేలా ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు చెబుతున్న సమాచారం ప్రకారం అఖిల్ సినిమా ఎక్కువ భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న లేదా 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉందని సమాచారం. కానీ ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఒకవేళ ఇన్ని రోజులు వాయిదా వేస్తే మాత్రం సినిమాకి ఉన్న హైప్ తగ్గిపోవచ్చని పలువురు విమర్శకులు అంటున్నారు. మరి అఖిల్ టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.