పిక్ ఆఫ్ ది డే: పవన్ ఫ్యామిలీతో ప్రధాని మోడీ.. మార్క్ భుజాలపై చెయ్యేసి మరీ..

టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇటీవల సైనస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు నుంచి ఇంటి వద్దనే రెస్ట్ తీసుకుంటున్న పవన్ ఆరోగ్యంపై ఆ మధ్య మెగాస్టార్ అప్డేట్ అందించారు. అలానే రీసెంట్ గానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇంటికి వెళ్లి కలిశారు. అయితే పవన్ పేరు ఇప్పుడు ఒక్క స్టేట్ వరకు మాత్రమే కాకుండా నేషనల్ లెవెల్లో సెన్సేషన్ అని అందరికీ తెలిసిందే.

దేశ ప్రధాని సైతం పవన్ ని ఆంధీ అని కొనియాడారు. మరి అలాంటి ప్రధాని ఇప్పుడు పవన్ కోసం కదలి వచ్చారు. స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పవన్ ని పరామర్శించారు. అంతే కాకుండా 20 నిమిషాల పాటు పవన్ తో తన కుటుంబంతో స్పెండ్ చేసిన ఫోటోలు ఇప్పుడు స్వయంగా నరేంద్ర మోడీ షేర్ చేయడం వైరల్ గా మారింది.

ఇక వీటిలో ఒకటైతే పిక్ ఆఫ్ ది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో పవన్ ఫ్యామిలీ మొత్తంతో మోడీ ఉన్నారు. పవన్ కళ్యాణ్, అన్నా, ఆద్య, అకిరా అలానే పోలేనా అంజనా, ఇంకా హైలైట్ మార్క్ శంకర్ పవనోవిచ్ ఇందులో అందరి దృష్టి ఆకర్షించాడు. ఎందుకంటే మోడీ మార్క్ భుజాలపైనే చెయ్యి వేసి నవ్వుతూ టోటల్ ఫ్యామిలీ పిక్ తీసుకున్నారు. దీనితో ఈ పిక్ మాత్రం మరింత స్పెషల్ గా మారి వైరల్ అవుతుంది.

Exit mobile version