ఆఫీసర్ సినిమా రిలీజ్ కు ముందు వరకు రామ్ గోపాల్ వర్మతో అఖిల్ అక్కినేని సినిమా చేస్తాడని వాళ్ళిద్దరి మధ్యలో సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అఖిల్ ,వర్మ సినిమా ను పక్కన పెట్టేశాడు అని తెలుస్తుంది . దీనికి కారణం ఆఫీసర్ సినిమా. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఎంత డిజాస్టర్ అయిందో అందరికి తెలిసిందే
మళ్లి ఇప్పుడు వర్మ ను నమ్మి అఖిల్ సినిమా చేసే పరిస్థితి అయితే కనబడటంలేదు .
ప్రస్తుతం వెంకీ అట్లూరి తో చేస్తున్న సినిమా తప్ప మరో చిత్రం గురించి ఆలోచించడం లేదు ఫ్యాన్స్ కు నచ్చే సినిమాలను మాత్రమే చేస్తా అని చెప్తున్నాడు. ఇక దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు వర్మతో సినిమా ఉంటుందా లేదా అని . ఇక ఈ విషయంలో నాగార్జున కూడా అఖిల్ నిర్ణయాన్నే సమర్దిస్తున్నారట .అసలే నాగ్ అఖిల్ ని స్టార్ గా చూడాలని కలలుకంటుంటే ఇప్పుడు వర్మ తో సినిమా చేయమని అఖిల్ ను ఎలా అడుగుతాడు . ఒకవేళ ఆఫీసర్ సినిమా హిట్ కాకున్నా పర్వాలేదు అనిపించుకున్న వర్మకు ఏమైనా ఛాన్స్ ఉండేదేమో .
