
అక్కినేని అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా సమాచారం మేరకు రెండో షెడ్యూల్ షూటింగ్‌కు సిద్ధమౌతోంది. రెండవ షెడ్యూల్ మార్చి 17 నుంచి హైద్రాబాద్‌లో మొదలు కానున్నట్లు సమాచారం.
ఇదే షెడ్యూల్‌లో కథానాయిక సయేషా కూడా జాయిన్ అవుతున్నారు. హీరో నితిన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాకు ఎస్. ఎస్. థమన్, అనూప్ రూబెన్స్ ఇద్దరూ సంగీతం సమకూర్చనుండడం విశేషం.