‘అఖిల్’ న్యూ ట్రైలర్ కోసం మీరు సిద్దమేనా.!!

Akhil
అక్కినేని ఫ్యామిలీ నుంచి దూసుకువస్తున్న మూడవతరం హీరో అఖిల్ అక్కినేని. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ అఖిల్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘అఖిల్’. తన పేరునే మొదటి సినిమాకి టైటిల్ గా పెట్టుకున్న అఖిల్ సినిమాకి సంబందించిన షూటింగ్ మొత్తం ఫినిష్ చేసాడు. మొదటి సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్న అఖిల్ మొదటి సారి యుఎస్ లో ప్రీ ప్రమోషనల్ టూర్ నిర్వహించాడు. ప్రస్తుతం అఖిల్ యుఎస్ లోనే సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ యుఎస్ టూర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవలే జరిగిన ఆడియో రిలీజ్ వేడుకలో విడుదల చేసిన ట్రైలర్ మరియు సాంగ్ ప్రోమోస్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కాకుండా అఖిల్ అండ్ టీం మరో న్యూ ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి సిద్దమవుతున్నారు. వచ్చే వారం మొదటి కల్లా అఖిల్ హైదరాబాద్ కి వచ్చేస్తాడు.. వచ్చాక అఖిల్ న్యూ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారు. ఈ ట్రైలర్ ని మొదటి దానికంటే బెటర్ గా, సినిమాపై మరింత క్రేజ్ పెంచే విధంగా ఉండేలా కట్ చేస్తున్నట్లు సమాచారం. కావున వచ్చే వారం మీరు అఖిల్ సినిమా నుంచి మరో ట్రైలర్ ని ఆశించవచ్చు.

అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ సినిమాకి నితిన్ నిర్మాత. అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందించిన ఈ సినిమా అక్టోబర్ 22న రిలీజ్ కానుంది.

Exit mobile version