
అక్కినేని వంశంలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీకి ‘అఖిల్’ సినిమా ద్వారా అక్కినేని అఖిల్ సిద్ధమైన విషయం తెలిసిందే. దసరా కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా, కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. అప్పట్నుంచీ అఖిల్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో ఎట్టకేలకు అఖిల్ టీమ్, దీపావళి కానుకగా నవంబర్ 11న పెద్ద ఎత్తున ఈ సినిమాను విడుదల చేయనున్న విషయాన్ని ప్రకటించేసింది. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఉత్సాహం నింపినట్లైంది.
ఇక అదేవిధంగా దసరా రేసు నుంచి ఈ సినిమా చివరి నిమిషంలో తప్పుకోవడంతో అప్పటికే మొదలుపెట్టిన ప్రమోషన్స్‌కు బ్రేక్ పడింది. అయితే తాజాగా సినిమా మళ్ళీ రిలీజ్‌కు దగ్గర పడడంతో ప్రచార కార్యక్రమాలను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగానే నవంబర్ 8న వైజాగ్‌లోని కళావాహిని ఆడిటోరియంలో అఖిల్ ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్‌కు సినిమా యూనిట్‌తో పాటు పలువురు ఇతర సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను హీరో నితిన్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన విషయం తెలిసిందే!