‘వావ్..’ ఇతడే అక్కినేని అఖిల్

akhil-wow
ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే అక్కినేని వారసుడు, నవ మన్మధుడు అఖిల్ అందరి చేత ‘వావ్..’ అనిపిస్తున్నాడు. యంగ్ జెనరేషన్ హీరోలలో అందగాడిగా పేరు సొంతం చేసుకున్న అఖిల్…. తొలి సినిమా షూటింగ్ మొదలుపెట్టకుండానే కమర్షియల్ యాడ్, మ్యాగ్‌జైన్‌ కవర్‌ పేజీ ఫోటోషూట్ లతో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంటున్నాడు.

ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగ్‌జైన్‌ ‘వావ్‌..’ 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల్ ముఖచిత్రాన్ని తమ కవర్ పేజిపై ప్రచురించింది. ‘స్టార్‌ సన్‌ ఆన్‌ ది రైజ్‌’గా అభివర్ణిస్తూ ఒక ప్రత్యేక వ్యాసం రాశారు. సాధారణంగా స్టైలిష్ లుక్ తో కనిపించే అఖిల్.. ‘వావ్..’ కవర్ పేజిపై సింప్లీ సూపర్బ్ అనిపించాడు. ఇలా యాడ్స్, కవర్ పేజిలపై అఖిల్ ను చూసి మురిసిపోతున్న అక్కినేని అభిమానులు త్వరలో తొలి సినిమా కబురు చెప్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version