అక్కినేని సాంగ్ షూట్ లో ముగ్గురు అక్కినేని హీరోస్

Akhil-nagarjuna-chatanya
చిన్నతనంలోనే సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా పరిచయం అవుతూ చేసిన మొదటి సినిమా ‘అఖిల్’. ఒక్క సాంగ్ మినహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ కానుంది. ప్రస్తుతం అఖిల్ పై పచ్చే అక్కినేని అనే సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి అఖిల్ కూడా సాంగ్ షూట్ లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ పాటలో అక్కినేని హీరోస్ అయిన నగర్జున్ – నాగ చైతన్యలు కూడా కనిపించనున్నారు.

ఇటీవలే యుఎస్ ప్రమోషనల్ టూర్ ఫినిష్ చేసుకొని వచ్చిన అఖిల్ ప్రస్తుతం తన పార్ట్ కి డబ్బింగ్ చెబుతూనే డే టైంలో షూటింగ్లో పాల్గొంటున్నాడు. మరోవైపు మిగతా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే అఖిల్ టీం రిలీజ్ కి ముందు ఆంధ్ర, తెలంగాణలతో పాటు చెన్నైలో భారీగా ప్రమోషనల్ టూర్ నిర్వహించడానికి సిద్దమవుతున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సయేషా సైగల్ హీరోయిన్ గా కనిపిస్తోంది. అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందించిన ఈ సినిమాని నితిన్ నిర్మించాడు.

Exit mobile version