కొన్ని సినిమాల విషయంలో మేకర్స్ చాలా బలంగా నమ్మి ఇచ్చే స్టేట్మెంట్ లు ఎన్నోసార్లు మిస్ ఫైర్ అయ్యిన సందర్భాలు కోకొల్లలు. కానీ కొందరి జడ్జిమెంట్ మాత్రం మిస్ అవ్వదు. అలాంటి వారిలో అక్కినేని సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున కూడా ఒకరు. తాను గట్టిగా నమ్మి ఓ సినిమాకి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అది ఆ అంచనాలు రీచ్ అయ్యేలా తీరుతుంది.
అయితే ఒక్కసారి అంటే ఏమో అనుకోవచ్చు కానీ మళ్ళీ చెప్పి మరీ కొట్టడం కింగ్ నాగ్ జడ్జిమెంట్ ని సినిమా రిజల్ట్ పట్ల తన కమిట్మెంట్ ని చూపిస్తుంది. గతంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమా సమయంలో వస్తున్నాం కొడుతున్నాం అంటూ ఇచ్చిన హుకుం మంచి వైరల్ గా మారింది అంతే కాకుండా చెప్పినట్టే ఆ సినిమా హిట్ కూడా అయ్యింది.
మళ్ళీ ఇప్పుడు తన వారసుడు అఖిల్ అక్కినేని నటించిన అవైటెడ్ సినిమా లెనిన్ కూడా మనోడు వస్తున్నాడు కొడుతున్నాడు అంటూ సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చారు. చెప్పినట్టే మళ్ళీ తన మాట నిజం అయ్యేలా కనిపిస్తుంది. సినిమాకి ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చేసింది. అయ్యగారు హిట్ కొట్టేశారని ట్రేడ్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇక సినిమాకి వచ్చే నెంబర్స్ పూర్తి ఫలితాన్ని డిసైడ్ చేయాల్సి ఉంది.
