వినూత్నంగా ట్రై చేస్తోన్న అక్కినేని వారసుడు !

Akhil1

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ‘అఖిల్, హలో’ చిత్రాల తరువాత చేస్తోన్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రం ఫై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.

కాగా ఈ చిత్రంలో అఖిల్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే అఖిల్ కు సంబంధించిన ప్రేమ సన్నివేశాలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయట. అన్ని కమర్షయల్ ఎలిమెంట్స్ ని ఫాలో అవుతానే.. కాస్త వినూత్నంగా కథనాన్ని నడుపుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

ఇక ఇటీవలే విడుదల చేసిన టైటిల్ సాంగ్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ సాంగ్ కు సంబంధించిన అఖిల్ సిక్స్ ప్యాక్ ఫోటో కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Exit mobile version