వైరల్ : ఫైనల్ గా ఇండియన్ సిటిజన్ అయ్యిన బాలీవుడ్ హీరో

Akshay

బాలీవుడ్ నుంచి ఉన్న అనేకమంది స్టార్ హీరోస్ లో జస్ట్ సినిమాలు తోనే కాకుండా తమ సేవా కార్యక్రమాలతో కూడా ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్న వారిలో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. మరి అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఓ మై గాడ్ 2” చిత్రం బాలీవుడ్ లో మంచి టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు కూడా రాబడుతుంది.

ఇక చాలా చిత్రాలు తర్వాత ఈ చిత్రం సక్సెస్ తో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉండగా ఈ హ్యాపీ మూమెంట్ లో మరో హ్యాపీ న్యూస్ ని అయితే అక్షయ్ ఇప్పుడు షేర్ చేసాడు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తాను ఇక నుంచి ఇండియన్ సిటిజన్ ని అని తెలిపాడు. అయితే ఇప్పటివరకు అక్షయ్ కుమార్ ఇండియన్ సిటిజన్ కాదు అని చాలా మందికి తెలియకపోవచ్చు.

తాను కొన్ని పర్శనల్ కారణాలతో ఇన్నాళ్లు ఒక కెనడియన్ సిటిజన్ గా మాత్రమే ఉన్నాడు. కానీ ఇప్పుడు అక్కడ పౌరసత్వాన్ని తాను రద్దు చేసుకొని భారత పౌరసత్వం లోకి మారినట్టుగా తెలిపాడు. దీనితో ఇక నుంచి నా గుండె పౌరసత్వం కూడా రెండూ స్వదేశీవే అంటూ కేంద్రం తనకి ఇచ్చిన సర్టిఫికెట్ ని చూపించి ఆనందం వ్యక్తం చేసాడు. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Exit mobile version