ఈ ఉగాది పండుగ కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో చేసిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. మంచి బజ్ నడుమ వచ్చిన ఈ గబ్బర్ సింగ్ కలయిక ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అయితే అందుకుంది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత థియేటర్స్ లో చూసిన జనం ఓ పర్టిక్యులర్ సీక్వెన్స్ కోసం మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు.
అదే సినిమాలో పాతబస్తీ సీక్వెన్స్. పవన్ బొట్టు పెట్టుకొని వెళ్లడం నుంచి అక్కడ యాక్షన్ ఎపిసోడ్ కానీ పవన్ కళ్యాణ్ యటిట్యూడ్ కానీ తాము అసలు ఎలా చూడాలి అనుకుంటున్నామో అలా దర్శకుడు హరీష్ శంకర్ ప్రెజెంట్ చేసి ఫ్యాన్స్ కి ఓ రేంజ్ డ్యూటీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసిన ఎవరికి అయినా సరే డెఫినెట్ గా ఇది పైసా వసూల్ సన్నివేశమే అని అనిపించక మానదు. ఇలాంటి సీన్స్ ఇంకా ఉన్నా సరే బాగుణ్ణు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు.
