ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర బాక్సాఫీస్ మాన్స్టర్ గా నిలుస్తున్న సినిమా ధురంధర్ పార్ట్ 2. మొదటి సినిమా తోనే ఎన్నెన్నో రికార్డులు ఇండియన్ సినిమా దగ్గర రణ్వీర్ సెట్ చేయగా ఇప్పుడు దానికి పార్ట్ 2 గా వచ్చిన ది రివెంజ్ సెన్సేషనల్ రెస్పాన్స్ తో ట్రేడ్ వర్గాలకు షాకిస్తుంది. అయితే హిందీ మార్కెట్లో ఒక ఊహించని రన్ ని సెట్ చేసిన పుష్ప 2 తాలూకా రికార్డులని ధురంధర్ పార్ట్ 1 బ్రేక్ చేసింది.
కానీ బుకింగ్స్ పరంగా టోటల్ ఇండియా వైడ్ గా బుక్ మై షోలో పీక్ హవర్స్ రికార్డ్ టికెట్స్ సేల్స్ రికార్డ్ ఉంది. ఇప్పుడు దీన్ని కూడా ధురంధర్ బ్రేక్ చేసేసింది. అది కూడా ఒక రోజు పూర్తి కాకుండానే బద్దలు కొట్టడం విశేషం. పుష్ప 2 కి ఒక్క గంటలో లక్ష 8 వేలకి పైగా టికెట్స్ బుక్ మై షోలో అమ్ముడుపోతే ధురంధర్ 2 ఒక్క గంటలో లక్ష 9 వేలకి పైగా టికెట్స్ తో బ్రేక్ చేసేసింది. ఇలా అప్పుడే ఊహించని రికార్డులు కూడా ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అని చెప్పవచ్చు.
