అందరిలో ఆసక్తిని పెంచేస్తున్న ట్రైలర్ @ ‘కంచె’

Kanchae
మెగా ఫ్యామిలీ నుంచి పరిచయమైన యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన రెండవ సినిమా ‘కంచె’. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లాంటి డిఫరెంట్ సినిమాలను అందించిన క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా రేపు ఉదయం 10 గంటలకు ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. అది కూడా సింపుల్ గా యు ట్యూబ్ లో రిలీజ్ చేసేయ్యకుండా హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో అభిమానుల సమక్షంలో రిలీజ్ చేయనుండడం విశేషం.

ఆగష్టు 15 కానుకగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచేశాయి. ముఖ్యంగా సినిమా వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో రానుంది అనే పాయింట్ అందరినీ బాగా టెంప్ట్ చేస్తోంది. తన సినిమాలో ఎమోషనల్ స్టోరీస్ ని బాగా చూపించే క్రిష్ ఈ సినిమాలో లవ్ ఎమోషన్స్ ని చాలా బాగా చూపారని, అలాగే విఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. అలాగే అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version