క్రేజీ సీక్వెల్ అయిన ‘కిక్ 2’ పైనే అందరి చూపు.!

క్రేజీ సీక్వెల్ అయిన ‘కిక్ 2’ పైనే అందరి చూపు.!

Published on Aug 18, 2015 12:36 PM IST

kick-2బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ అయిన ఓ సినిమాకి సీక్వెల్ చెయ్యాలి అంటే చాలా పెద్ద రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకంటే అభిమానుల్లో ఆ సీక్వెల్ పై ఫస్ట్ పార్ట్ కి మించి అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం చాలా కష్టం. అందుకే మన టాలీవుడ్ లో సీక్వెల్స్ జోలికి పెద్దగా వెళ్ళరు. కానీ అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా మాస్ మహారాజ్ రవితేజ చేసిన క్రేజీ సీక్వెల్ ‘కిక్ 2’. 2009లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కిక్ సినిమాకి ఇది సీక్వెల్. మొదటి వార్ట్ లోని రవితేజ – ఇలియానాల వారసుడి కథే ఇది.

మొదటి పార్ట్ లో రవితేజ తన కిక్ కోసం ఎంతపని చెయ్యడానికైనా సిద్దపడతాడు, అలానే ఇందులో కూడా రవితేజ తన కంఫర్ట్ కోసం పక్కోడితో కబడ్డీ ఆడుకునే టైపు. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. అదే కాక తమన్ అందించిన పాటలకి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగు ప్రక్షకులతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా ఈ క్రేజీ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. రవితేజ సరసన ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల కలల రాణిగా మారిన రకుల్ ప్రీత్ ఇస్ంగ్ హీరోయిన్ గా కనిపించనుంది. మొదటి పార్ట్ లో లానే రవితేజ – బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి ప్రధాన హైలైట్ కానుంది. టోటల్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో రేసుగుర్రం ఫేం రవి కిషన్, జిల్ ఫేం కబీర్ సింగ్ లు విలన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు