అందరి చూపులు రాజాసాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పైనే.. డార్లింగ్ వస్తాడా..?

Raja Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజా సాబ్'(Raja Saab) చిత్రం విడుదలకు సిద్ధమైంది. రొమాంటిక్ హారర్ కామెడీ ఫాంటసీగా రూపొందిన ఈ సినిమా, 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా, భారత్‌లో ఒక రోజు ముందుగానే అంటే జనవరి 8న పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నారు.

ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా రేపు సాయంత్రం 5 గంటల నుండి హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో సినిమాకు సంబంధించిన సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఈవెంట్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్వయంగా హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రభాస్‌ను సరికొత్త వింటేజ్ లుక్‌లో చూపించబోతోంది.

Exit mobile version