మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సాలిడ్ స్పోర్ట్స్ డ్రామా గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ ని చేస్తూ వస్తున్నారు. ఇక ఫైనల్ గా నేడు విజయవాడలో భారీ గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
మరి ఈ ఈవెంట్ పైనే ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి. ఫ్యాన్స్ అయితే మరింత ఆసక్తిగా ఈ ఈవెంట్ కోసం అందులో హైలైట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్ని ఈరోజులు సినిమాకి సంబంధించి కొంచెం మినిమల్ గానే మాట్లాడిన బృందానికి ఇప్పుడు ఫైనల్ గా మన తెలుగు స్టేట్స్ ఆడియెన్స్ ముందు మొత్తం క్లుప్తంగా మాట్లాడే అవకాశం వచ్చింది. సోయి పెద్ది ఈవెంట్ లో మేకర్స్ ఎలాంటి విషయాలు మాట్లాడుతారు అనేది అందరిలో ఆసక్తిగా మారింది. సో ఈ సాయంత్రం ఈవెంట్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాల్సిందే.
