విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పూర్తిగా కొత్త నటీనటులతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమా టైటిల్ పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ‘జెంజ్ బ్యాచ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కథకి అనుగుణంగానే ఈ సినిమాకి ఈ ట్రెండీ టైటిల్ ను పెట్టారట. ఇక షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్ లో జరుగుతున్నాయి. సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చిందట.
కాగా క్రిష్ ఈ సినిమాని చాలా ట్రెండీగా తీశారని తెలుస్తోంది. పైగా ఈసారి కమర్షియల్ అంశాలతో పాటు భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తూ తనదైన శైలిలో క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. నిజానికి స్టార్ హీరోల కంటే కథను నమ్మే దర్శకుడిగా క్రిష్ కి మంచి పేరు ఉంది. అందుకే, మరోసారి కొత్త ప్రతిభను పరిచయం చేస్తూ ప్రత్యేకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ తో క్రిష్ హిట్ కొడతారా ? లేక, ఎప్పటిలాగే పేరు మాత్రమే వస్తోందా ? అనేది చూడాలి.
