హీరో గోపిచంద్ కెరీర్ కు చాలా కీలకంగా మారిన సినిమా ‘పంతం’. నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో ఈ చిత్ర్రం రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లతో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది చిత్రం. ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 30న హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ హల్ లో జరగనుంది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి చేస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. గోపీచంద్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాతో విజయాన్ని అందుకుని హిట్ ట్రాక్ ఎక్కాలనే ఆలోచనలో ఉన్నారు గోపీచంద్.
