మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ రిలీజ్ డేట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ, ఈ చిత్రాన్ని మేకర్స్ జూన్ 2026కి వాయిదా వేశారు. ఇక షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరికొంత సమయం అవసరమవ్వడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణాలలో ఒకటి ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ షూటింగ్. ఈ స్పెషల్ సాంగ్‌లో రామ్ చరణ్‌తో కలిసి చిందులేసేందుకు మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ఎంపికైనట్లు సమాచారం. ఈ పాట షూటింగ్ రేపటి నుండి వనస్థలిపురంలో ప్రారంభం కానుంది. చరణ్ మాస్ డ్యాన్స్‌కు, సంయుక్త గ్లామర్ తోడవ్వడంతో ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
వృద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు మరియు బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
