మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే పెద్ది. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పట్ల గత కొంత కాలం నుంచి సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. దీని కోసం చాలామంది హీరోయిన్స్ పేర్లు వచ్చి చివరి నిమిషంలో మారినవి కూడా లేకపోలేదు.
ఇక ఈ నేపథ్యంలో పెద్ది స్పెషల్ సాంగ్ కి రంగం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. రేపు ఏప్రిల్ 26న సాంగ్ షూట్ శృతి హాసన్ రామ్ చరణ్ కలయికలో మొదలు కానున్నట్టు తెలుస్తుంది. మరి వీరిద్దరి నడుమ క్రేజీ డ్యూయెట్ సాంగ్స్ ఎవడు అనే సినిమాలో పడిన సంగతి తెలిసిందే. మళ్ళీ వీరి కలయికలో ఒక స్పెషల్ సాంగ్ ఇప్పుడు రావడం మరింత స్పెషల్ గా మారింది. మరి ఆ మ్యాజిక్ ని ఈ కాంబినేషన్ రిపీట్ చేస్తుందా లేక ఇంకా అంతకు మించి ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే.


