‘ఇరుముడి’ ట్రైలర్ కి రంగం సిద్ధం.. ఎప్పుడు ఎక్కడ లాంచ్ అంటే!

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. తన గత సినిమాలతో పోలిస్తే సాలిడ్ హైప్ ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ఇలా ఫైనల్ గా రిలీజ్ కి దగ్గర పడుతున్న ఈ సినిమా తాలూకా ట్రైలర్ కి మేకర్స్ రంగం సిద్ధం చేశారు.

నిజానికి ఈ ట్రైలర్ రిలీజ్ కి ఓ వారం ముందు విడుదల చేస్తారని టాక్ వినిపించింది కానీ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చే విధంగా చిత్ర యూనిట్ ఇంకో వారం ముందే ట్రైలర్ ని తీసుకొస్తున్నట్టుగా ఇపుడు ప్రకటించారు. రవితేజపై మాస్ పోస్టర్ ఒకటి విడుదల చేసి ఈ ట్రైలర్ ని ఆగష్టు 12న భీమవరం వేదికగా విడుదల చేస్తున్నట్టు ఖరారు చేశారు.

భీమవరంలో ఎస్ ఆర్ కె ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఘనంగా విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. సో ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఆగష్టు 21 న సినిమా తెలుగు, తమిళ్ లో విడుదల కానుంది.

Exit mobile version