ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కోసం హాట్ డిస్కషన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తన ఎపిక్ సినిమాలు బాహుబలి సిరీస్ కోసం వారు పంచుకున్న మాటలు, ఎమోషన్స్ నెట్ ఫ్లిక్స్ లో బాహుబలి ది టార్చ్ బేరర్ గా వచ్చి ఓటీటీలో సూపర్ హిట్ అయ్యింది. అయితే బాహుబలి సినిమాలు వచ్చి ఎంతో కాలం అయ్యింది.
కానీ ఇప్పుడు మరోసారి బాహుబలి కోసం మాట్లాడాల్సిన అవసరం ఏముంది అనే డౌట్స్ కూడా చాలా మందికి డౌట్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఇదంతా ఖచ్చితంగా పాన్ వరల్డ్ సినిమా దగ్గర రాజమౌళి తనకంటూ ఒక ప్రత్యేక సుస్థిర స్థానాన్ని సెట్ చేసుకోడానికి జరుగుతున్న ప్రయత్నం అని కూడా అనుకోవచ్చు. రాజమౌళి చేస్తున్న నెక్స్ట్ సినిమా వారణాసి గ్లోబల్ లెవెల్లో ఆల్రెడీ ఫిక్స్ చేశారు.
అయితే దీనికి బలమైన పునాది కూడా అంతే అవసరం. సో అందుకు దోహదపడే ఏ చిన్న అంశాన్ని కూడా రాజమౌళి అండ్ టీం వదులుకోవట్లేదు అనుకోవచ్చు. తనకి గ్లోబల్ స్టేజి మీద మంచి ఫేమ్ తీసుకొచ్చిన సినిమా బాహుబలి, ఆ తర్వాత RRR. పైగా తన ప్రయాణం ఆస్కార్స్, అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ లాంటి దిగ్గజ స్టేజి లకు వెళ్ళడానికి పెద్ద కారణాల్లో ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కి కూడా సింహభాగం ఉంది.
సో అక్కడ నెట్ ఫ్లిక్స్ తోనే కొనసాగుతున్న వీరి ప్రయాణంలో ఒకోకటిగా మెట్టు ఎక్కుతూ వెళుతున్నారా అనిపిస్తుంది. ఇప్పుడు బాహుబలి కోసం స్పెషల్ సిరీస్ వచ్చింది. నెక్స్ట్ RRR కోసం కూడా వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా రీసెంట్ గానే వారణాసి ఓటీటీ డీల్ కూడా నెట్ ఫ్లిక్స్ తో లాకయ్యే ఛాన్స్ ఉన్నట్టు టాక్ వచ్చింది.
ఇలా జక్కన్న తనకి సినిమాకి ప్రపంచ స్టేజి వద్ద ఒక బలమైన స్థానాన్ని ఏర్పర్చేందుకు జరుగుతున్న మహా యజ్ఞం ఇది కావచ్చు ఎవరికి తెలుసు? ఏది ఏమైనప్పటికీ మాత్రం రాజమౌళి అలా ముందుకు వెళుతున్న కొద్దీ అది తనకే కాదు మన తెలుగు సినిమాకి, భారతీయ సినిమాకి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టడం అనేది ఖాయం.
