అల్లరి నరేష్ ‘జంప్ జిలానీ’ రిలీజ్ డేట్

jum-jilani
టాలీవుడ్ ప్రెజెంట్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ ద్విపాత్రాభినయంలో ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన సినిమా ‘జంప్ జిలానీ’. ఇన్ని రోజులు జూన్ లో రిలీజ్ చెయ్యాలనుకున్న ఈ సినిమాకి ఈ చిత్ర టీం ఒక రిలీక్ డేట్ ని లాక్ చేసారు. ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ లు హీరోయిన్స్ గా నటించారు.

తమిళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిన ‘కలగలప్పు’ సినిమాకి ఇది రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి తీసిన ఈ సినిమాకి ఇ. సత్తిబాబు డైరెక్టర్. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి అంబికా రాజా నిర్మించిన ఈ సినిమాకి విజయ్ ఎబెంజర్ మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ కి ఈ రీమేక్ సినిమా అన్నా హిట్ ఇస్తుందేమో చూడాలి.

Exit mobile version