ఆ నలుగురిలో నేను లేను.. పవన్ సినిమా రిలీజ్ రగడపై అల్లు అరవింద్

Allu Arvind HHVM

రీసెంట్ గానే టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన ఊహించని రగడ కోసం అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ అందులోని ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ ముందు టాలీవుడ్ నుంచి ‘ఆ నలుగురు’ నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు మూలాన తన సినిమాకే ఇబ్బంది తలపెట్టినట్టు అయ్యింది.

పవన్ నుంచి కావాల్సిన సమయంలో అంతా హైక్స్ తీసుకొని చివరికి తన సినిమా సమయంలోనే ఇబ్బంది పెట్టి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అంటూ పవన్ హర్ట్ అయ్యిన మాట అందరికీ తెలిసిందే. ఇలా టాలీవుడ్ లో కొనసాగుతున్న ఈ రచ్చ విషయంలో దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ పెట్టిన ప్రెస్ మీట్ ఇందులో తాను చెప్పిన అంశాలు వైరల్ గా మారాయి.

అసలు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే దానిని ఆపాలని దుస్సాహసం ఎవరైనా చేస్తారా? అది ఎవరైనా సరే ఆ దుస్సాహసానికి ముందడుగు వెయ్యకూడదు అని తెలిపారు. అలాగే ఇపుడు వైరల్ అవుతున్న ఆ నలుగురు అంశంపై కూడా స్పందిస్తూ దానికి తనకి సంబంధం లేదని నేను ఆ నలుగురులో లేను అంటూ అసలు క్లారిటీ కూడా ఇచ్చారు. దీనితో అల్లు అరవింద్ స్టేట్మెంట్ ఇపుడు వైరల్ గా మారింది.

Exit mobile version