త్రివిక్రమ్ సినిమాలో కొత్త ‘అల్లు అర్జున్’ !

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వస్తోన్న సినిమా ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ను త్రివిక్రమ్ కాస్త వైవిధ్యంగా చూపించబోతున్నాడట. బన్నీ డ్రెసింగ్ స్టైల్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకూ ఈ సినిమాలో కొత్త అల్లు అర్జున్ ని చూస్తామని సమాచారం. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కూడా బన్నీ మాడ్యులేషన్ని కాస్త కొత్తగా మార్చాడు త్రివిక్రమ్.

ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’కి, అలాగే బన్నీతో డీజే సినిమాకి పనిచేసింది. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మించనున్నారు.

ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ముఖ్యంగా తండ్రి కొడుకులు మధ్య వచ్చే ఎమోషన్సే ప్రధానాంశంగా సినిమా ఉంటుందట. ఇక ఈ సినిమాలో సుశాంత్, నవదీప్ లు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది.

Exit mobile version