బర్త్‌డే బ్లాస్ట్: బన్నీ-అట్లీ మూవీ టైటిల్ ఫిక్స్.. ‘రాక’గా మారిన ఐకాన్ స్టార్!

raaka 1

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న #AA22 క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘రాక’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది.

​ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని అత్యంత భయంకరమైన అవతారంలో కనిపిస్తున్నాడు. ఒక మనిషి జంతువుగా మారే ‘వేర్-బీస్ట్’ కాన్సెప్ట్‌తో ఈ లుక్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ రగ్గడ్ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసింది.

​తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, అల్లు అర్జున్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తోడవడంతో ‘రాక’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనిపిస్తోంది. ఐకాన్ స్టార్ 44వ పుట్టినరోజు వేళ విడుదలైన ఈ అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో ‘రాక’ మేనియా ఊపేస్తోంది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది అత్యంత ప్రయోగాత్మక చిత్రంగా నిలవనుంది.

Exit mobile version