గ్లామర్ బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్

allu-arjun
గత ఏడాది ‘రేసుగుర్రం’తో భారి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్, వసూళ్ళ రేసులో దూసుకుపోయాడు. ప్రతి సినిమాతో తన సక్సెస్ రేంజ్ ను పెంచుకుంటూ వెళ్తున్న అల్లు అర్జున్.. కమర్షియల్ యాడ్ ప్రపంచంలో సైతం తన జోరు చూపిస్తున్నాడు. ఓ.ఎల్.ఎక్స్, లాట్ మొబైల్స్ తదితర కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అల్లు అర్జున్, తాజాగా మరో కంపెనీకి తన సేవలను అందించనున్నాడు.

ప్రముఖ టు వీలర్ కంపెనీ హీరో సంస్థకు చెందిన గ్లామర్ 125 సిసి బైక్ బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేశాడు. ఇటివలే విడుదల ఈ యాడ్ వీడియోలో స్టైలిష్ & గ్లామరస్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోయే సినిమా మొదలుపెడతారు.

అల్లు అర్జున్ గ్లామర్ 125సిసి కమర్షియల్ యాడ్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Exit mobile version